జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్

దాదాపు నాలుగు వారాల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఆర్యన్


ముంబయి: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబయి లోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. ఆర్యన్ ను జైలు నుంచి రిసీవ్ చేసుకోవడాని పెద్ద సంఖ్యలో షారుఖ్ మనుషులు జైలు వద్దకు వచ్చారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ దాదాపు నాలుగు వారాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. గత గురువారం ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అదే రోజు బెయిల్ ఆర్డర్ ను విడుదల చేయలేదు. నిన్న మధ్యాహ్నం బెయిల్ ఆర్డర్ ను విడుదల చేసింది. బెయిల్ షరతులను చదివి వినిపించింది. బెయిల్ వచ్చినప్పటికీ రెండు రాత్రులు ఆర్యన్ జైల్లోనే గడిపాడు. నిన్న సాయంత్రం 5.30 గంటల్లోగో బెయిల్ పేపర్లను సమర్పించడంలో ఆర్యన్ లీగల్ టీమ్ విఫలమయింది. దీంతో నిన్న రాత్రి కూడా ఆర్య జైల్లోనే గడిపాడు.

మరోవైపు ఆర్యన్ విడుదల నేపథ్యంలో… షారుఖ్ ఇంటి వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆ ప్రాంతమంతా చాలా హడావుడిగా ఉంది. ఆర్యన్ కోసం ఆయన కుటుంబసభ్యులు కూడా తీవ్ర భావోద్వేగంతో ఎదురు చూస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/