తిరువ‌నంతపురం మేయ‌ర్ గా 21 ఏళ్ల విదార్థిని ఆర్య రాజేంద్ర‌న్ ఎన్నిక

దేశంలో అతిపిన్న వయసులో మేయర్‌ పీఠం రికార్డు

Arya Rajendran
Arya Rajendran

Kerala: కేరళ రాజధాని తిరువనంతపురంకు చెందిన 21 ఏళ్ల విద్యార్ధిని ఆర్య రాజేంద్రన్ దేశంలోనే అతిపిన్న వయసులో ఆ నగరానికి మేయర్ గా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన తిరువ‌నంత‌పురం సివిల్ బాడీ పోల్స్‌ లో ముదవన్ముగల్ నుంచి వార్డ్ కౌన్సిలర్‌ గా ఆమె ఎన్నికయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఎం నుండి రంగంలోకి దిగిన అతి పిన్న వయస్కురాలు ఆమె. విపక్ష కూటమి నుంచి సీనియర్‌ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ.. ఆమె ముందు నిలవలేదు. అయితే అనూహ్యంగా ఆమె మేయర్‌ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.

తిరువనంతపురం మేయర్‌ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్‌ను ఎంపిక చేస్తున్నట్లు ఎల్డీఎఫ్ నేత‌లు ప్రకటించారు. దీంతో దేశంలో అతిపిన్న వయసులో మేయర్‌ పీఠం అధిరోహించిన యువతిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.

స్థానిక ఎల్‌బీఎస్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం సీపీఎం పిల్లల విభాగమైన కేరళ బాలసంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ తనకు అప్పగించిన పాత్రను సంతోషంగా తీసుకుంటానని ఆర్య విలేకరులతో అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/