హోలీ వేడుకలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ దూరం

కరోనాను అదుపు చేసేందుకు రాష్ట్రస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఏడాది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని ప్రకటించారు. ప్రజలు ఎన్నో కష్టనష్టాల్లో ఉన్న కారణంగా నేను, కానీ మా మంత్రులు కానీ, ఎమ్మేల్యేలు కానీ హోలీ జరుపుకోవడం లేదని కేజ్రీవాల్‌ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్‌తో ఎదురయ్యే పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. తన అధ్యక్షతన ఎర్పాటు చేసే టాస్క్‌ ఫోర్స్‌లో పలు ఏజెన్సీలు, డిపార్టుమెంట్‌లు, కార్పొరేషన్ల సభ్యులు ఉంటారని, ప్రతి ఒక్కరకీ ఒక్కో బాధ్యత అప్పగిస్తామని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/