నిన్న ఢిల్లీ చేసిన పనిని నేడు అమెరికా చేస్తుంది

ప్లాస్మా థెరపీపై మాట్లాడిన ఢిల్లీ సిఎం

cm-arvind-kejriwal

న్యూఢిల్లీ: ప్లాస్మా చికిత్స‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎఫ్‌డీఏ) ఓకే చెప్పిందని అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఆ విషయాన్ని తాము ముందే గ్రహించామని అన్నారు. నిన్న ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందో, నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే మాటంటున్నారని అన్నారు.

‘గతంలో ఏదైనా అమెరికా చేసిన తరువాతనే ఇండియా చేస్తుందని అనేవారు. నేడు అమెరికా చేస్తున్నది రేపు ఇండియా చేస్తుందన్న వ్యాఖ్యలు ఇక ఉండవు. ఢిల్లీ దాన్ని మార్చేసింది. నిన్న ఢిల్లీ చేసిన పనిని నేడు అమెరికా చేస్తున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ వాసులకు, ఈ ఘనత సాధించిన దేశానికి నా కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను కూడా కేజ్రీవాల్ జోడించారు. కాగా, గతంలో కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ పనికిరాదని వ్యాఖ్యానించిన ట్రంప్, ఆదివారం నాడు మాట్లాడుతూ, ప్లాస్మా థెరపీ చక్కగా పనిచేస్తుందని అన్న సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/