సీఎం అభ్యర్థి ఎవరో బిజెపి ప్రకటించాలి

సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బిజెపి ప్రజల తీర్పు కోరుతుందని ఎద్దేవా

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: బిజెపి సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రజల తీర్పును కోరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో వెల్లడించాలని కేజ్రీవాల్‌ కాషాయ పార్టీకి సవాల్‌ విసిరారు. దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలోగా బిజెపి తమ పార్టీ సీఎం అభ్యర్ధిని వెల్లడించాలని లేనిపక్షంలో తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని చెప్పారు. ఢిల్లీలో ప్రజాతీర్పు వెలువడిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అమిత్‌ షా చెబుతున్నారని, కానీ బిజెపి ఓటు వేస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు. విద్యాభ్యాసం లేని అసమర్ధుడిని సీఎంగా అమిత్‌ షా ప్రకటిస్తే అప్పుడు ఢిల్లీ ప్రజలను మోసగించినట్టు కాదా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/