చిత్రకారుడు సూర్యప్రకాశ్‌ కన్నుమూత

Artist Surya Prakash
Artist Surya Prakash

హైదరాబాద్‌: ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్‌ (78) కన్నుమూశారు. ఆయన ఖమ్మం జిల్లా మధిరలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మొదట సీసీఎంబీకి రెసిడెన్సియల్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. జేఎన్‌టీయూ కాలేజీలో ఫైన్‌ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్టర్ కోర్సులో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1961 నుంచి 1964 వరకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. తన ఉద్యోగానికి రాజీనమా చేసిన సూర్యప్రకాశ్ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీరాంకుమార్ వద్ద ఆరు నెలలు అప్రెంటిస్ చేశారు. ఆయన ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/