కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా కేంద్రం సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. కేంద్రం నిర్ణయంపై దాఖలైన మొత్తం 14 పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులు గల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ పిటిషన్లపై విచారణ జరపనున్నట్టు వెల్లడించారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ఇంటర్‌లొక్యూటర్‌ను నియమించాలన్ని కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/