పాకిస్థాన్‌లో భారత్‌ సినిమాలు నిషేధం

Firdous Ashiq Awan
Firdous Ashiq Awan

ఇస్లామాబాద్ : జమ్మూకాశ్మీర్ విభజన , ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పై దాయాది దేశమైన పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే పాక్ భారత్ తో ఉన్న వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. జమ్మూకాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి భారత్ సైనికులు మోహరించారు. అయితే భారతీయ సినిమాలపై పాక్ నిషేథం విధించింది. పాక్ లోని థియేటర్లలో ఇకపై భారత్ సినిమాలు ప్రదర్శించబడవని పాక్ సమాచార, ప్రసారశాఖ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ పిర్దౌసి ఆశిక్ అవన్ తెలిపారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరించే వరకు కాశ్మీరీలకు పూర్తి మద్ధతు ఇస్తామని ఆమె తేల్చి చెప్పారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/