ఉద్యోగ సంఘాల నేతల అరెస్ట్‌

నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరణ

Arrest of union leaders
Arrest of union leaders

Hyderabad: ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఐక్యవేదిక నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగుల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు, పబ్లిక సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈపీఆర్సీని ప్రకటించాలంటూ ఒక్కరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు.

పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన ఐక్య వేదిక నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/