ఎమ్మెల్యె జగ్గారెడ్డి అరెస్ట్‌

Jagga Reddy
Jagga Reddy

సంగారెడ్డి: ఎమ్మెల్యె జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఆయన జలదీక్షకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు పూనుకుంటానని వెల్లడించారు. అయితే నేడు ఆయన జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్‌ పీఎస్‌కు తరలించారు.గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/