వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు

కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్

Harsh Vardhan
Harsh Vardhan

New Delhi: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో రేపటి నుంచి  ప్రారంభం కానుంది.  వ్యాక్సిన్ పై అపోహలు వలదని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ తో దుష్పరిణామాలు వస్తాయన్న అపోహలు వదంతులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా స్వల్ప జ్వరం,వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పులు కలుగుతాయన్నారు.

ఈ లక్షణాలు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వంధత్వం  వస్తుందన్న సందేహాలు వలదనీ, అవన్నీ వదంతులోననీ కొట్టి పారేశారు.  కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వం చెప్పే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/