బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి ఏర్పాట్లు

అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ శనివారం తన కార్యాలయంలో దేవాదాయశాఖ, జీహెచ్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆలయంలో భక్తులు భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరింపచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లాక్ నిబంధనలన్నింటినీ అమలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో శర్మ, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న , ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/