వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు

TSSPDCL
TSSPDCL


హైదరాబాద్‌: వేసవిలో విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు గాను టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి కొత్తగా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయటం, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. మరోవైపు ఫీడర్లకు అంతరాయం కలిగించే చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు జంక్షన్ల వద్ద మరమ్మత్తు పనులు చేస్తున్నారు.. వేసవిలో వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వేసవిలో తలెత్యే సమస్యలను ముందుగానే ఊహించి దాదాపు రెండు నెలల ముందునుంచే మరమ్మత్తుపనులు ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గద్దెల ఎత్తు పెంచడం, స్విచ్‌ బోర్డుల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. వేసవితో పాటు వర్షాకాలంలో కూడా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టంగా మరమ్మత్తు పనులు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: