అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేయండి

లక్ష ఐసొలేషన్ పడకలను ఏర్పాటు చేయండి .. సిఎం అశోక్ గెహ్లాట్ ఆదేశం

ASHOK GEHLOT
ASHOK GEHLOT

రాజస్థాన్‌: కరోనా వైరస్‌ నియంత్రణపై ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐసొలేషన్ పడకలను ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. వీటి కోసం కళాశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లను గుర్తించాలని సూచించారు. నిన్న సాయంత్రం వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో గెహ్లాట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం జిల్లా కలెక్టర్లతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేయాలని ఆదేశించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/