కశ్మీర్‌కు సైనికుల తరలింపు!

Indian Army
Indian Army

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధానికి సిద్ధమవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పిఒకెను కూడా తాము స్వాధీనం చేసుకుంటామని భారత్ తేల్చి చెబుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సరిహద్దుకు సైనిక బలగాలను తరలిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సైనికులను రోడ్డు, వాయు మార్గాల్లో కశ్మర్ కు తరలిస్తున్నారు. సైనికుల తరలింపుపై అధికారులు స్పందించడం లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, దీని గురించి అడుగొద్దని వారు సూచిస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/