మయన్మార్ లో ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు!
ఎమర్జెన్సీ ప్రకటన !

మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను సైనికులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఇటీవల ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యాధికారులు ఆరోపిస్తూ, నేతలను అరెస్ట్ చేయడంతో పాటు ఏడాది పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/