విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్

విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలు చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటూ వెళ్తున్న విశ్వక్..రీసెంట్ గా ఓరి దేవుడా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ దేవుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ మాస్ హీరో మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.

ఫలక్ నూమా దాస్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కాంట్రవర్సీ అయిన ఈ హీరో ఇటీవల విడుదైలన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన పనికి వివాదంలో పడ్డాడు. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ స్టంట్ కింది ఓ ప్రాంక్ వీడియో చేసి అబాసుపాలయ్యాడు. అతి ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే.

ప్రస్తుతం విశ్వక్ సేన్.. డైరెక్టర్ అండ్ యాక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ నెల 03 నుండి షెడ్యూల్ లో పాల్గొనాల్సిన విశ్వక్..షెడ్యూల్ లో పాల్గొనకపోగా , అర్జున్ కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదట. దీంతో విశ్వక్ సేన్ పై అర్జున్ సర్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై మాట్లాడారు. ”షూటింగ్ కు రమ్మని విశ్వక్ కు ఎన్నోసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. షెడ్యూల్ మార్చమని చెబుతున్నాడు. మొత్తం షెడ్యూల్ ఎలా మారుస్తారు. విశ్వక్ సేన్ బిహేవియర్ మా టీమ్ కు ఎంతో ఇబ్బందికి గురి చేసింది. ఈ విషయం గురించి అతనితో ఎన్నిసార్లు మాట్లాడాలని పిలిచినా విశ్వక్ సేన్ స్పందించలేదు” అని అర్జున్ సర్జా చెప్పుకొచ్చాడు.

కథ నేరేట్ చేసినప్పుడు విశ్వక్ సేన్ పిచ్చిపిచ్చిగా నచ్చిందన్నాడు. ఆ తర్వాత అతన్ని షూటింగ్ రమ్మని చెబితే సరైనా సమయానికి రాలేదు. అతని వల్ల రెండు సార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కథ నేరేట్ చేశాకు విశ్వక్ సేన్ ఒక రెమ్యునరేషన్ చెప్పాడు. నేను అంతా ఇచ్చుకోలేనని చెప్పాను. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఓ ఏరియా రైట్స్ ఇవ్వమని అడిగితే సరే అన్నా. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత స్టోరి డిస్కషన్స్ కోసం ఎన్నిసార్లు పిలిచినా లిఫ్ట్ చేయలేదు. కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్ ని పంపిద్దామని ఫోన్స్ చేసినా అటెండ్ చేయలేదు. నా జీవితంలో అన్ని ఫోన్ కాల్స్ ఎవరికీ చేయలేదు. నేను కానీ, నా టీమ్ గానీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

పని పట్ల విశ్వక్ సేన్ కు కమిట్ మెంట్ లేదు. నాకు వంద కోట్లు వస్తాయని చెప్పినా ఎప్పటికీ విశ్వక్ తో సినిమా చేయను. డైరెక్టర్ గా నాకు ఒక విజన్ ఉంటుంది. టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ లు, చంద్రబోస్ రాసిన పాటలు నచ్చలేదని మధ్యలో ఇబ్బంది పెట్టాడు. అతని ప్రవర్తన ఏమాత్రం బాలేదు. ప్రొడ్యూసర్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లేంట్ చేస్తున్నాం. నాకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నా. నాది మంచి కథ. త్వరలో మరొక హీరోతో సినిమా తీస్తాను అని అర్జున్ తెలిపారు.