పవన్ కళ్యాణ్ కు ఆ శాఖలు ఫిక్స్ చేసినట్లేనా..?

ఏపీలో కూటమి భారీ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిన్న సీఎం గా చంద్రబాబు తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. కాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ వెంటనే వారికీ శాఖలు కేటాయిస్తారని భావించారు కానీ ఈరోజు కు వాయిదా వేశారు. ఈరోజు ఏ క్షణైయినా వారికీ శాఖలు కేటాయించనున్నారు చంద్రబాబు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏ శాఖా కెటాయిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

పవన్‌ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లుగా సమాచారం. పవన్‌ అభ్యర్థన మేరకు చంద్రబాబు ఆ శాఖను కట్టబెట్టినట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.