ఆర్సిలర్‌ మిట్టల్‌ పరం అయిన ఎస్సార్‌ స్టీల్స్‌

42వేలకోట్లకు ఏకమొత్తంలో చెల్లింపు

arcelormittal
arcelormittal

న్యూఢిల్లీ : ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సిటర్‌ మిట్టల్‌ ఎస్సార్‌స్టీల్స్‌ కొనుగోలుకు 42వేలు కోట్లు పెట్టుబడులుపెట్టేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం రుణభారంతో సతమతంఅవుతూ ఎన్‌సిఎల్‌టికి దాఖలు పడిన ఎస్సార్‌స్టీల్‌ను కొనుగోలుచేసేందుకు ఆర్సిలర్‌ మిట్టల్‌ ఆధ్వర్యంలోని కంపెనీ కొనుగోలుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినసంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ వర్గాలనుఅనుసరించి అర్సిలర్‌మిట్టల్‌ ఒకటిరెండురోజుల్లోనే భారీ మొత్తం సొమ్ము చెల్లిస్తారని చెపుతున్నారు. ఆర్సిలర్‌మిట్టల్‌ కంపెనీ మొత్తం నిధులను సోమవారం నాటికే బదిలీచేస్తుందని బ్యాంకింగ్‌ నిపుణులు చెపుతున్నారు. ఎస్‌బిఐకి మొత్తం 42వేల కోట్లు సొమ్ము అందుతుందని, ఎస్‌బిఐ ఎస్సార్‌స్టీల్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్ల కూటమికి లీడ్‌బ్యాంక్‌గా వ్యవహరిస్తోందని అందువల్ల ఆ మొత్తం ముందు లీడ్‌బ్యాంక్‌ ఖాతాకే చేరుతుందని చెపుతున్నారు. అయితే ఈ డీల్‌పై మిట్టల్‌కంపెనీ వ్యాఖ్యానించేందుకు తిరస్కరించింది. బ్యాంకర్లకు ఈ సొమ్మునుచెల్లించినతర్వాత ఐబిసి ప్రణాళికల కింద ఏకమొత్తంలో భారీగా రికవరీచేపట్టిన సంస్థగా ఎస్సార్‌స్టీల్స్‌ నిలుస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/