ప్రయాణికులకు APSRTC సంక్రాంతి ఆఫర్

6,970 Special Services for Sankranthi: APS RTC

ప్రయాణికులకు APSRTC సంక్రాంతి ఆఫర్ ను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ పండక్కి వెళ్లేందుకు రెండు నెలల ముందు నుండే ప్రయాణికులు బస్సు , రైల్వే , విమాన టికెట్స్ బుక్ చేసుకుంటారు.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఊరెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులకు APSRTC శుభవార్త అందించింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. http://apsrtconline.in వెబ్‌సైట్‌‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించారు. రౌండ్ ట్రిప్ (రాను, పోను) బుక్ చేసుకుంటే టికెట్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని తెలిపారు. త్వరగా బుక్ చేసుకోండి.. సాధారణ ఛార్జీలతో ప్రయాణించండి అని అధికారులు ట్వీట్ చేశారు. అలాగే సంక్రాంతికి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సులు నడిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలు ఉంటాయని చెబుతున్నారు. దసరా పండుగ సమయంలో నడిపిన స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేశారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగకు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.