ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలు ప్రకటించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు అని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. 325 మంది ఇంటర్వ్యూ వరకు వచ్చారని , కోర్టు తీర్పుకు లోబడే ఈ ఫలితాలు వర్తిస్తాయి తెలిపారు.

ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. వైఎస్సార్‌ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్‌ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్‌-1 2018 నోటిఫికేషన్‌లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

డిప్యూటీ కలెక్టర్లు- 30, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ 08, డీఎస్పీలు 27, డీఎస్పీ (జైల్ల శాఖ) 1, డీఎఫ్ఓ 1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు 11, ఆర్డీవోలు 5, అసిస్టెంట్ ప్రొహిబిషన్ 1-06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు 47, జిల్లా రిజిస్టర్లు 01, జిల్లా ఉపాధి కార్యాలయం 02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్టర్స్ 01,( జోన్-2),01 ( జోన్ 3), జిల్లా గిరిజన అధికారి 01,ఎస్సీ సంక్షేమ అధికారి 01,బీసీ సంక్షేమ అధికారి 01,డిపిఓ 01,గ్రేడ్ 2 మునిసిపల్ కమిషనర్లు 1, ఏపీ వైద్యారోగ పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారులులు-మల్టీజోన్ 1-06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 02(జోన్ 3),04(జోన్ 4).గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారు.