మహారాష్ట్రలో సంరక్షక మంత్రుల నియామకం

Mumbai: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాష్ట్రంలోని 36 జిల్లాలకు ‘సంరక్షక మంత్రుల’ను నియమించారు. ఉద్ధవ్ థాకరే కుమారుడు, రాష్ట్ర పర్యవరణం, పర్యాటక రంగ శాఖల మంత్రి ఆదిత్య థాకరే ముంబై సబర్బన్ జిల్లాకు సంరక్షక మంత్రిగా నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పుణకు సంరక్షక మర్తరిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ నేత, టెక్స్‌టైల్స్, మత్స్య శాఖల మంత్రి అస్లాం షేక్ ముంబై నగరానికి సరంక్షక మంత్రిగా నియమితులయ్యారు. మిగిలిన వారిలో కాంగ్రెస్ నేత, రెవిన్యూ మంత్రి బాలాసాహెబ్ థొరాట్ కోలాపూర్‌కు, ఎన్‌సిపి నేత హసన్ ముష్రిఫ్ అహ్మద్‌నగర్‌కు సంరక్షక మంత్రులుగా నియమితులయ్యారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/