ఐఫోన్ ప్రియులకు శుభవార్త

Apple new iPhones
Apple new iPhones

శాన్‌ఫ్రాన్సిస్కో: ఐఫోన్ ప్రియులకు శుభవార్త. సెప్టెంబరు 10న జరిగే కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త మోడల్‌ ఐఫోన్లు రాబోతున్నాయి. ఏటా సెప్టెంబరు 10న కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదే రోజున కొత్త మోడళ్లను విడుదల చేస్తూ రావడం యాపిల్‌ ఆనవాయితీగా మారింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త ఐఫోన్‌ను ఆవిష్కరించేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లకు కొనసాగింపుగా ఐఫోన్‌ 11 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసే అవకాశముంది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/