ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు షాక్

వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ చీఫ్ డిజైనర్ అయిన జానీ ఐవ్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ కంపెనీకి షాక్ తగిలింది. అయితే జానీ ఈ ఏడాది చివరన యాపిల్‌కు రాజీనామా చేసి తన సొంత డిజైనింగ్ సంస్థను నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. 1992లో జానీ యాపిల్ సంస్థలో చేరారు. 1996లో డిజైనింగ్ జట్టులో స్థానం సంపాదించారు. అప్పటి నుంచి యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి ప్రధాన అనుచరుడిగా ఉంటూ సలహాలిస్తుండేవారు. కంపెనీని అగ్రస్థానంలో నిలపడంలో జానీ శ్రమ కూడా ఉంది. జానీ 28 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. యాపిల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈయన డిజైన్లే కంపెనీకి కొత్తరూపు తీసుకొచ్చాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/