యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌కు వేతనంలో కోత

tim-cook
tim-cook

అమెరికా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వార్షిక వేతనం గతేడాది కాస్త తగ్గింది. 2018లో కుక్‌ 15.7 మిలియన్‌ డాలర్ల వేతనం తీసుకోగా, 2019 సంవత్సరానికి గాను 11.6 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకున్నారు. 2018తో పోలిస్తే గతేడాది యాపిల్‌ పర్‌ఫార్మెన్స్‌ తగ్గడంతో టిమ్‌ కుక్‌ వేతనంలో కోత పడింది. గతేడాదికి గానూ టిమ్‌ కుక్‌ 3 మిలియన్‌ డాలర్ల మూలవేతనం అందుకోగా.. 7.7 మిలియన్‌ డాలర్లు ప్రోత్సాహక బోనస్‌ కింద తీసుకున్నారు. యాపిల్‌ పనితీరుపై ఆధారపడి ఈ బోనస్‌ ఇస్తుంటారు. 2018లో టిమ్‌ కుక్‌ 12 మిలియన్‌ డాలర్లు బోనస్‌ రూపంలో అందుకున్నారు. అయితే గతేడాది ఈ విక్రయాలు 28 శాతం పెరగడంతో సీఈవో బోనస్‌ తగ్గించారు. ఇక సెక్యూరిటీ, ఇతర ప్రయోజనాల కింద మరో 8,85,000 డాలర్లను కుక్‌ అందుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కుక్‌ తన వ్యాపార, వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేటు విమానాన్ని ఉపయోగిస్తారు. ఆ ఖర్చును కంపెనీయే భరిస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/