యాపిల్ వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు

వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటివద్ద నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) టిమ్ కుక్ కీలక ప్రకటన చేశారు. యాపిల్ ఉద్యోగులతో ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలా వద్దా..? అనే అంశంపై తమ ఉద్యోగులతో చర్చించారు. తమ ఉద్యోగులు వచ్చే జూన్ వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో సంస్థ సాధించిన ఫలితాల్ని బట్టి ఆ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించే విషయం ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
అయితే, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడంలో ఉన్నసానుకూలతలను కుక్ గుర్తుచేశారు. అయినప్పటికీ.. ఆఫీస్ కు రాకపోయినా మంచి ఫలితాల కోసం పనిచేయడం నేర్చుకోగలిగామన్నారు. ఈ సంక్షోభ కాలంలో వచ్చిన మంచి మార్పులను కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటామని యాపిల్ సీ ఈ ఓ టిమ్ కుక్ వెల్లడించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/