పేదలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు

‘మన్‌ కీ బాత్‌’ లో ప్రధాని మోదీ

PM Modi
PM Modi

New Delhi: కరోనా పై యుద్ధానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన లాక్‌డౌన్‌ కారణంగా పేదప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. 

కరోనాపై యుద్ధంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నారు కఠినంగా వ్యవహరించడం ద్వారానే కరోనాపై విజయం సాధించగలమన్నారు.

కరోనాను పారద్రోలడం కోసం ప్రజలు మరి కొన్ని రోజులు లక్ష్మణరేఖను  పాటించాలని కోరారు.

ఎటువంటి లక్షణాలు లేనప్పటికి చాలామంది స్వీయ క్వారంటైన్‌ను పాటిస్తున్నారన్న మోడీ వారందరికీ అభినందనలు తెలిపారు.

అయితే చాలా మంది లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆయన అది ఎంత మాత్రం తగదన్నారు.

సామాజిక దూరం పాటించాల్సిందిదేననీ,  సామాజిక దూరం అంటే మానసికంగా దూరం కాదనీ మోడీ చెప్పారు. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు భారత్‌ వందనం చేస్తున్నదన్నారు,

కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారన్నారు.

ఏ విధమైన భౌతిక ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవ చేసే వైద్యుడే అత్యుత్తమ వైద్యుడని , అటువంటి సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు వందనం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/