వినాయక నిమజ్జనం లో అపశృతి

Ganesh Nimajjanam -file
Ganesh Nimajjanam -file

హర్యానా లో వినాయకనిమజ్జనం లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పలువురు మృతి చెందిన ఘటన ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ పండగ వాతావరణం చోటుచేసుకుంటుంది. ప్రతి గల్లీకి ఒక వినాయకుడిని ప్రతిష్ఠించి ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి యువకులు, పెద్దవారి వరకు అంత కూడా గణేష్ నవ రాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే గణేష్ నవ రాత్రులు ఎంత ఘనం గా జరుపుకుంటారో ఇక వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా అంతే ఘనంగా జరుపుకుంటారు అని చెప్పాలి.

బ్యాండ్ బాజా లతో డీజే పాటల తో అంగరంగ వైభవం గా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు గణేష్ నిమజ్జన కార్యక్రమం లో అప శృతి చోటు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంత ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

తాజాగా హర్యానాలో అలాంటిదే జరిగింది. నిమజ్జనం చేస్తున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సోనిపట్‌లో నిమజ్జనం చేస్తూ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మహేంద్రగఢ్‌లో నలుగురు మృతి చెందారు. నిమజ్జనం సందర్భంగా సమీపంలోని చెరువులు, నదుల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోనిపట్‌లోని మిమార్పూర్ ఘాట్ వద్ద నిమజ్జనానికి కుమారుడు, మేనల్లుడితో కలిసి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. మహేంద్రగఢ్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న కాలువలో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అర్ధరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వీరిలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ విచారం తెలుపుతూ..వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.