కమలం దళం లోకి అపర్ణ యాదవ్!


సమాజ్‌వాదీ పార్టీకి షాక్!

Aparna Yadav
Aparna Yadav

Lucknow: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరికపై ఆ పార్టీ అధిష్టానం కొన్ని రోజులుగా అపర్ణ యాదవ్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం . రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం అంగీకరించడంతో కాషాయo కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్టు ప్రచారం ఉంది. అపర్ణ యాదవ్‌, ములాయం సింగ్‌ చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ సతీమణి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీ టికెట్‌పై అలహాబాద్‌ నుంచి ఆమె పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ జోషి చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆమె రూ.11లక్షలు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/