రాష్ట్ర పాలనంతా రివర్స్‌ టెండరింగ్‌ లాగే ఉంది

Kala Venkata Rao
Kala Venkata Rao

అమరావతి: ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ వైఎస్‌ఆర్‌సిపి సర్కారుపై ధ్వజమెత్తారు. భారతదేశ చిత్రపటంలో అమరావతిని లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. టిడిపి పోరాటం వల్లే కేంద్రం భారతదేశ చిత్రపటంలో మళ్లీ అమరావతికి చోటు కల్పించిందని కళా వెంకట్రావ్‌ చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ విధానాలను ఎవరూ ప్రశ్నించినా..అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పాలనంతా రివర్స్‌ టెండరింగ్‌ లాగే ఉందని విమర్శించారు. ఇంకా వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు రాజధానిపై పూటకో మాట మాట్లడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 22 మంది ఎంపీలుంటే రాష్ట్రానికి ప్రత్యేకా హోదా తెస్తానని జగన్‌ అన్నారని, ఆయన ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/