‘విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన జగన్’

ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శ

AP TDP President Achennaidu
AP TDP President Achennaidu

Amaravati: రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలో కెక్కారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘జగన్ విధ్వంసం’ పేరుతో తెలుగుదేశం పార్టీ ఛార్జి షీట్ ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని అన్నారు. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతా రని , కానీ వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతో మొదలు పెడుతుందని అన్నారు.

జేసీబీతో ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసాన్ని ప్రారంభించారని.. వారి పరిపాలన పై ఎవరైనా ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు చేయిస్తారని ఆరోపించారు.సీఎం జగన్ ఏది చెప్తే అది.. సీఐడీ చేయడానికి సిద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీలో ప్రతీ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని..జగన్ పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
ప్రజలకు ‘నవరత్నాలు’ కాదు , నకిలీ రత్నాలు ఇచ్చారని అన్నారు. తమ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప కొత్త పథకాలు ఏవి అమలు చేశారంటూ ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/