ఏ క్షణాన్నైనా 3 రాజధానుల పాలన
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన

Amaravati: రాష్ట్రంలో ఏ క్షణాన్నైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే సంబంధిత పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక అని, వాళ్లది పైశాచిక ఆనందమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/