ఏపిలో మధ్యాహ్నం నమోదైన ఓట్లు

voters
voters

అమరావతి: ఏపిలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ కొనసాగుతుంది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 11 గంటల వరకు పోలైన ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని కేశనుపల్లిలో మొత్తం 956 మంది ఓటర్లల్లో 385 మంది ఓటు వేశారు.
• గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువులోని పోలింగ్‌ కేంద్రంలో 1396 మంది ఓటర్లలో 404 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
• ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనూతలలో 1070 మంది ఓటర్లలో 240 మంది ఓటు వేశారు.
•నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో ఇసుకపాలెంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద 1084 మందికిగానూ 313 ఓట్లు పోలయ్యాయి.
• నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నియోజకవర్గం పరిధిలో అటకానితిప్పలో 578 మందిలో 330 మంది ఓటు వేశారు.
గుంటూరు జిల్లా నల్లచెరువు పోలింగ్‌ కేంద్రాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ పరిశీలించారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఈ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/