‘పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి’

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి

ap PRC GOs should be withdrawn- Secretariat Employees Union
Venkatramireddy, president of the Secretariat Employees Union, spoke to the media on Tuesday

Amaravati: గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోందని అయితే ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. మంగళవారం విలేక రులతో మాట్లాడారు. తాము ఆఫీసర్స్ కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించామని తెలిపారు. ఫిట్మెంట్ తక్కువైనా.. మిగిలిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించామని అంతేకాకుండా హెచ్ ఆర్ సి విషయంలో క్లారిటీ ఇవ్వాలని కూడా గతంలో సీఎం కు చెప్పామని అన్నారు. హెచ్ ఆర్ సి ని తగ్గించడాన్ని, ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జిఓ లను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా కొన్ని అంశాల్లో రాజీ పడడానికి సిద్దమే అని. కానీ ప్రతి అంశంలోనూ రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని పేర్కొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. మిగిలిన సంఘాలతో కూడా కలిసి చర్చించుకుని ఉమ్మడి వేదిక మీదకు వచ్చి పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం సీఎం అప్పాయింట్మెంట్ కోరుతున్నామని , భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతామని తెలిపారు. బుధవారం లేదా ఎగురువారం నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నామని వెల్లడించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/