ఏపీలో పీఆర్సీ జీవోపై నేడు హైకోర్టులో విచారణ

జివోను రద్దు చేయాలని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిటిషన్

Gazetted Officers' Association has filed a petition in the High Court against the new PRC
Gazetted Officers’ Association has filed a petition in the High Court against the new PRC

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై ఇవాళ హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర‌ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవో పై హైకోర్టు విచారించ‌నుంది. కొత్త పీఆర్సీ కారణంగా రావాల్సిన ప్రయోజనాలు రాకపోగా, జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వెంటనే పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ జీవో తో తమకు అన్యాయం జరుగుతుందని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/