భారీ స్కామ్‌ను త్వరలో బయటపెడతా?

AP Planning Commission Depty Chairman Kutumba Rao
AP Planning Commission Depty Chairman Kutumba Rao

దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంచేసే
భారీ స్కామ్‌ను త్వరలో బయటపెడతా?

రాష్ట్రానికి శిఖండిలా మారిన బిజెపినేత జివిఎల్‌
ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు

హైదరాబాద్‌: భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంచేసే భారీస్కామ్‌ వివరాలను, ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానని ఏపి ప్రణాళిక, అభివృద్ది బోర్డు ఉపాధ్యక్షులు సి. కుటుంబరావు ప్రకటించారు. ఈకుంభకోణంలో మనదేశంతోపాటు రష్యా, చైనా దేశాల పాత్ర కూడా ఉందని..త్వరలోనే ఈస్కాంకు సంబంధించిన అన్ని వివరాలను ఆధారాలతో సహా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌, సిఎంవోకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈస్కాంపై ప్రధాని కార్యాలయం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మనదేశానికి చెందిన ఎస్సార్‌ గ్రూపు టెలికాం, అయిల్‌తో సహా అనేక రంగాల్లో వ్యాపారం చేస్తున్నట్లు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా రుణాలు తీసుకున్నారనీ, మొదట టెలికాం రంగాన్ని అమ్మకానికి పెట్టి, దానికి సంబంధించిన పన్ను రాయితీకి చెందిన కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. తర్వాత ఎస్సార్‌ గ్రూపుకు చెందిన ఎస్సార్‌ అయిల్‌ను అమ్మకానికి పెట్టారనీ, రష్యాకు చెందిన ప్రభుత్వ రంగసంస్థకు, ఎస్సార్‌ అయిల్‌ను రూ.73,000 కోట్లకు అమ్మినట్లు ఒప్పందాలు చేసుకన్నారనీ, కానీ 2017 మార్చిలో ఎస్సార్‌ అయిల్‌ కంపెనీ విలువ బ్యాలెన్స్‌ షీట్‌లో రూ.3500 కోట్లుగా చూపించారని కుటుంబరావు వెల్లడించారు.

2016 డిసెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన బ్రిగ్స్‌ సమావేశంలో ప్రభుత్వం టు ప్రభుత్వం ఒప్పందంగా ఈఅమ్మకాన్ని ప్రొజెక్ట్‌ చేశారని, ఈఒప్పందం సందర్బంగా ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పరస్సరం ఒప్పందపత్రాలు మార్చుకున్నారన్నారు. వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకున్నారు కానీ వాస్తవంగా ఒప్పందం జరిగింది

మనదేశానికి చెందిన ఎస్సార్‌ గ్రూపు, రష్యాకు చెందిన అయిల్‌ బిజినెస్‌ చేసే ప్రభుత్వ రంగ సంస్థ రాస్‌నెప్ట్‌ల మధ్య జరిగిన ఒప్పందమని ఆయన పేర్కొన్నారు. ఈఒప్పంద సమయంలో రష్యాకు చెందిన ఆర్థిశ శాఖమంత్రి కూడా గుజరాత్‌లోనే ఉన్నాడని, ఈఒప్పందానికి ముందే ఎస్సార అయిల్‌లో వాటాదారులుగా ఉన్న మదుపరుదారులను కంపెనీ విలువ రూ.35000 కోట్లేనని వారిని పక్కకు తప్పించారన్నారు. ఎస్సార్‌, రాస్ట్‌నెప్ట్‌ ఒప్పందంపై విచారణ జరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయని కుటుంబరావు వివరించారు. బిజెపి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రుడై ఉండి శిఖండిలా దాపురించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసేవిధంగా మాట్లాడుతున్నారని కుటుంబరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపి ప్రభుత్వం కేంద్రం చేసిన సాయంతోనే నడుస్తుందని ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.

బిజెపి అంటేనే భారతీయ జిమ్మిక్కుల పార్టీఅని, ఏపికి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
====