కృష్ణా జలాలపై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విజ్ఞప్తి

AP petitions Supreme Court on Krishna waters
AP petitions Supreme Court on Krishna waters

Amaravati: కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టుల అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీటి వాటా విషయంలో తెలంగాణ వైఖరిని తప్పుబడుతూ ఏపీ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. విభజన చట్టాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అంతర్ రాష్ట్ర నదులపై ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. వాటి నిర్వహణ, బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొంది. శ్రీశైలంలో తక్కువ నీరు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీ న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని పేర్కొంది. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని పిటిషన్‌లో కోరింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/