ఏపీ సర్కార్ కు పంచాయతీ ఉద్యోగులు షాక్..

Govt of AP
Govt of AP

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి పంచాయతీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 02 నుండి సమ్మె కు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యానికి ప్రతీక మహాత్మా గాంధీజీ జయంతి రోజు అయినా అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసు పంపింది. తమకు చెల్లించాల్సిన బకాయి, జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలని పంచాయతిరాజ్ శాఖ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం కోరింది.

పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేసింది. నెలకు రూ. 6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, రక్షణ పరికరాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని కోరింది. అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, సాధారణ మృతికి రూ. 5లక్షలు అందించాలని పంచాయతిరాజ్ శాఖ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అంతే కాకుండా పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం వెంటనే ఆపేయాలని కోరారు. .