ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల లెక్కింపులో బోణి కొట్టిన వైసీపీ

ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతోపాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ లెక్కింపు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగుతుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ..

దాచేపల్లి నగర పంచాయతీ:

దాచేపల్లి నగర పంచాయతీ 4, 5, 6, 7 వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం
దాచేపల్లి నగర పంచాయతీ 13వ వార్డులో వైకాపా అభ్యర్థి విజయం
దాచేపల్లి నగర పంచాయతీ 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం
దాచేపల్లి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
గురజాల ఒకటో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు

అనంతపురం:

  • పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ
  • 14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత
  • 17వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం
  • 18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం

కమలాపురం

  • 17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో విజయం
  • 9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం..
    *10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం..
  • 16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం
  • కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం
  • కొవ్వూరు పురపాలిక 23వ వార్డులో తెదేపా అభ్యర్థి రమాదేవి విజయం
  • కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం