బీసీలను టిడిపి ఓటుబ్యాంకుగానే చూసింది

టిడిపి నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారు

vellampalli srinivas
vellampalli srinivas

విజయవాడ: బీసీలను టిడిపి ఓటుబ్యాంకుగానే చూసిందని..వారి అభివృద్ధికి పాటు పడలేదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బీసీలను ఎదుగుదలను ఓర్వలేక నారా లోకేష్‌ అనుచరులు అడ్డుపడటమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకో వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం పై దృష్టిపెడుతున్నారు. మంగళవారం 26వ డివిజన్‌లో మున్సిపల్‌ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి..సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టిడిపి మోకాలడ్డే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తే టిడిపి నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/