ఏపి మంత్రి కుటుంబంలో కరోనా కలకలం

వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తల్లో కలవరం

corona virus
corona virus

అనంతపురం: ఏపి మంత్రి శంకరనారాయణ సోదరుడి కుటుంబంలో మగ్గురుకి కరోనా సోకింది. దీంతో ఆయను కలిసిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు,కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా పెనుకొండలో 17 మందికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు, మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ చేసి, రసాయనాలతో శానిటైజ్ చేశారు. మంత్రి నారాయణ మేనత్త ఇటీవలే కన్నుమూశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా మంత్రి సోదరుడు సహా ముగ్గురికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో, వీరిని ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/