అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష

ఎనిమిది నెలల కిందటే టిడిపి పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారు

Kurasala Kannababu
Kurasala Kannababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిది నెలల కిందటే చంద్రబాబును టిడిపి పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారని విమర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయంటున్నారు.. మరి ఇతర ప్రాంతాల్లో రావా? ముంబై, చెన్నై నగరాలు సముద్ర తీరం వద్దే ఉన్న విషయం చంద్రబాబు అండ్‌ టీంకు తెలియదా? ఎల్లో మీడియా అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో ఇటీవలే భూకంపం వచ్చింది. మరి భూకంపంవచ్చే ప్రాంతంలో చంద్రబాబు రాజధాని ఎందుకు పెట్టారు? అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/