రూ. 2 వేల కోట్లు దొరికిందని ఎవరూ చెప్పలేదు

రెండు వేల కోట్లు ఎవరూ ఇంట్లో పెట్టుకోరు!

kodali nani
kodali nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాజీ పర్సనల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఐటీ సోదాల్లో రూ. 2వేల కోట్ల క్యాష్‌ దొరికిందని ఎవరూ చెప్పలేదని కొడాలి నాని అన్నారు. రెండు వేల కోట్లు రుపాయలు పీఎస్‌ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పిచ్చోడు కాదని వ్యాఖ్యానించారు. రెండు వేల కోట్లు ఎవరూ ఇంట్లో పెట్టుకుని కూర్చోరని అన్నారు. రెండు వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆస్తులు, డాక్యుమెంట్లు సంబంధించిన వివరాలు దొరికాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఎస్‌ తన డైరీలో రాసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని కొడాలి నాని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/