ఎందుకీ గర్జనలు అంటూ పవన్..బదులిచ్చిన మంత్రి అమర్నాథ్

అమరావతిః ఈ నెల 15న విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సిపి గర్జన సభ నిర్వహించనుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందిస్తూ, ఎందుకీ గర్జనలు… రాష్ట్రాన్ని మరింత అధోగతి పాల్జేయడానికా? అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. “దత్త తండ్రి చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ మియావ్ మియావ్” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “1.అంతర్జాతీయ రాజధాని మాస్కో 2. జాతీయ రాజధాని ముంబయి. 3. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్… ఇవే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్” అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/