జగన్‌ మాట్లాడేటివన్నీ అసత్యాలే

Ap Minister Devineni Uma
Ap Minister Devineni Uma

Amaravati: అసెంబ్లికి రాని ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ జగన్‌ మార్నింగ్‌ వాక్‌లు, ఈవినింగ్‌ వాక్‌లలో మాట్లాడేటివన్నీ అసత్యాలేనన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని జగన్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. బోగస్‌ ఓటర్ల పేరుతో, చనిపోయిన వ్యక్తుల పేర్లతో కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఇడుపులపాయకు రాజధాని తరలింపునకు జగన్‌ కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీ, కేసీఆర్‌, ఓవైసీతో జగన్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన జగన్‌ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడరన్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కై వెయ్యి కోట్ల గిఫ్ట్‌కు జగన్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.