సిట్‌ ఏర్పాటు చేస్తే టిడిపి నేతలు గగ్గోలు పెడుతున్నారు

పీపీఏల విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది

avanthi srinivas
avanthi srinivas

ప్రకాశం: పీపీఏల విషయంలో గత టిడిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అవినీతిని వెలికితీసేందుకు సిట్‌ ఏర్పాటు చేస్తే టిడిపి నేతలు గగ్గోలు పెడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ ప్రేవేశపెట్టింది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రేడ్డేనని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్‌ కొరత ఏర్పడిందని అవంతి అన్నారు. కాగా రాజధాని విషయంలో ఆయన స్పందిస్తూ సంపద ఒకేచోట పెడితే భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉందని అవంతి శ్రీనివాస్‌ చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/