ఏపి మంత్రి అనిల్‌ పోలవరం పర్యటన

Minister Anil kumar
Minister Anil kumar

పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనులను ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ పర్యవేక్షించారు. అనిల్ కు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు స్వాగతం పలికారు. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పనులను పర్యవేక్షించిన అనంతరం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఆరు నెలల పాటు ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిర్వాసితుల తరలింపుపై అధికారులతో చర్చించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/