పవన్‌ను విమర్శించిన మంత్రి అనిల్‌ కుమార్‌

Anil Kumar & Pawan kalya
Anil Kumar & Pawan kalyan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించారు. పవన్‌ పింక్‌ అనే సినిమాలో రీమేక్‌లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. అంటే దానికి అర్థం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ పాలన అద్భుతంగా ఉందని ఆయన ఒప్పుకుంటున్నట్లే అని చెప్పుకొచ్చారు. కాగా పవన్‌ జగన్‌ పాలన బాగుంటే తాను తిరిగి సినిమాలు చేసుకుంటానని ఓ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే. వాస్తవాలను గ్రహించి ప్రతిపక్ష నేతలు మాట్లాడాలని మంత్రి అనిల్‌ అన్నారు. ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పవన్‌ ప్రవర్తన సరిగా లేదని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కాగా రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తే తాను పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండేది కాదని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/