ఏపీలో మరో దారుణం ..

ఏపీలో మరో దారుణం ..

ఆంధ్రప్రదేశ్ లో వరుస దారుణాలు ప్రభుత్వాన్ని విమర్శల పాలుచేస్తుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి మొన్న ఓ వివాహిత ఫై దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన నుండి ఇంకా బయటకు రాకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

ఏలూరు రూరల్ మహేశ్వరపురంలో మైనర్ బాలికను భాస్కర్ అనే యువకుడు వేధింపులకు గురిచేశాడు. మైనర్ బాలిక ఫోటోను అసభ్యకరంగా చిత్రీక‌రించి సోషల్ మీడియాలో పోస్టుచేసాడు. పోస్టును చూసి బాలిక తల్లిదండ్రులకు వారి బంధువులు ఫోన్ చేసి తెలిపారు. దాంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ కు గుర‌య్యారు. యువ‌కుడిపై ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ ఫిర్యాదు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తూ నింధితుల‌ను శిక్షిస్తున్నా మార్పు రాకపోవడం మహిళలను భయాందోళకు గురి చేస్తుంది. ఇంట్లో నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

…………