ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలురుది పైచేయి అని వెల్లడించారు.


ఇంట‌ర్ ఫస్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్‌కు 9,20,552 మంది విద్యార్థులు, వృత్తి విద్యాకోర్సుల‌కు 83,749 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే.